Cabinet Approves New Telecom Policy
| to Create 4 Million Jobs by 2022 in INDIA.
కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు
దిల్లీ: కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చెరకు రైతుల కోసం గత జూన్‌మాసంలో రూ.8500 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం తాజాగా.. మరో రూ.4500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. చక్కెర ఎగుమతి కోసం మిల్లులకు రవాణా రాయితీ కింద ఈ ప్యాకేజీని పంపిణీ చేయాలని నిర్ణయించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది.
కొత్త టెలికం పాలసీకి ఆమోదం
వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా దేశంలో 40లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో కేంద్రం రూపొందించిన కొత్త టెలికం విధానానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ (ఎన్డీసీపీ) -2018 పేరుతో రూపొందించిన ఈ విధానం ద్వారా 5జీ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను విస్తృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటు ధరలో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఒక సెకెనుకు 50 మెగాబైట్ల వేగంతో 5జీ సేవలను విస్తృతం చేయడం ద్వారా 2020 నాటికి దేశంలో 40లక్షల ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ విధానం కింద స్పెక్ట్రం ధరలను హేతుబద్ధీకరించడం ద్వారా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన టెలికం రంగాన్ని గట్టెక్కించాలని కేంద్రం భావిస్తోంది.
No comments:
Post a Comment