Friday, 28 September 2018

Aadhar Scheme New Upadate Information 2018


Aadhaar Scheme is Constitutionally Valid | No Need to Accounts, Mobiles | SC

ఆధార్ దేనికి అవసరం.. దేనికి అవసరం లేదు




దిల్లీ: ప్రతి చిన్న పనికీ ఆధార్‌.. మధ్య చర్చంతా దీనిపైనే. సర్కారు సేవలన్నింటికీ ఆధార్‌ తప్పనిసరి అని చెప్తుంటే.. కొందరు మాత్రం దీని వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని అంటుండడంతో వివాదం నెలకొంది. ఆధార్‌ ఎక్కడ అవసరం, ఎక్కడ అవసరం లేదనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా నేడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో స్పష్టత వచ్చింది.

భారత పౌరులకు జాతీయ గుర్తింపు కార్డు అయిన ఆధార్‌ గురించి నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆధార్‌ రాజ్యాంగ బద్ధమే అని స్పష్టం చేసింది. అయితే కొన్ని షరతులను కూడా విధించింది. ఆధార్‌ సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి వీల్లేదని ఆదేశించింది. అలాగే వీలైనంత తొందరగా సమాచార సంరక్షణకు చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వానికి తెలిపింది. అలాగే అక్రమ వలసదారులు ఆధార్‌ పొందకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తాజా తీర్పు నేపథ్యంలో ఆధార్‌ ఎక్కడెక్కడ అవసరమో, ఎక్కడ అవసరం లేదో తెలుసుకుందాం.
---------------------------------------------------------------------
ఆధార్‌ దేనికి అవసరం
* పాన్‌ కార్డుకు
* ఆదాయపన్ను రిటర్నులు ఫైల్‌ చేయడానికి
* ప్రభుత్వ సబ్సిడీలు, సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు
ఆధార్‌ దేనికి అవసరం లేదు
* బ్యాంకు ఖాతాలకు
* టెలికాం సేవలకు, మొబైల్‌ నంబరుతో అనుసంధానానికి
* సీబీఎస్‌ఈ, నీట్‌, యూజీసీ పరీక్షలకు


* స్కూల్‌ అడ్మిషన్లకు

No comments:

Post a Comment

EENADU | TELANGANA | 04-05-2023