FREE
Education in GERMANY,.....
విదేశీ విద్య
ఉచిత విద్యకు ఛలో జర్మనీ!
దేశాంతరాల్లో ఉన్నతవిద్య మనకందేది కాదని మధ్యతరగతి వాళ్లు చాలామంది మౌనంగా ఉండిపోతారు. కానీ వీరికీ అందుబాటులో తక్కువ ఖర్చుతో లేదా ఉచితంగా జర్మనీ విద్యను అందిస్తోంది. ఉద్యోగావకాశాలూ మెరుగ్గా ఉన్నాయి. లాంగ్ స్టే వీసా, ఇంటర్న్‌షిప్‌లు అదనపు ఆకర్షణలు.
ఇక్కడి యూనివర్సిటీల్లో చదువుతున్న 20.7 లక్షల మంది విద్యార్థుల్లో 3.4 లక్షలమంది విదేశీ విద్యార్థులే. నాణ్యమైన విద్య, ప్రామాణిక కరిక్యులమ్, చక్కటి మౌలిక సదుపాయాలు జర్మనీ ప్రత్యేకతలు. సమ్మర్ ఇన్‌టేక్ దరఖాస్తు ప్రక్రియకు సమయం సమీపిస్తున్న సందర్భంగా జర్మనీ విద్యాభ్యాసం విశేషాలు.. మీకోసం!
400 పైగా ఉన్న జర్మన్ విశ్వవిద్యాలయాలు విభిన్నమైన సబ్జెక్టుల్లో వైవిధ్యమైన కోర్సులు అందిస్తున్నాయి. బోధన, పరిశోధనలను సమ్మిళితం చేసి, ఆచరణాత్మక విద్యతో మౌలిక ఆవిష్కరణలకు బాటలు వేస్తాయి.
పరిశ్రమ- విద్యాసంస్థలకు మధ్య అనుసంధానం ఇక్కడ ఎక్కువ. అందుకే విద్యార్థుల కెరియర్‌కు నేరుగా ప్రయోజనం కల్పించే ఇంటర్న్‌షిప్ అవకాశాలు విస్తృతంగా లభిస్తాయి.
విదేశీ విద్యార్థులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత విద్యను అందిస్తారు. కొన్ని యూనివర్సిటీలు ట్యూషన్ ఫీజును వసూలుచేసినా, అది తక్కువే ఉంటుంది.
ఇక్కడ టెక్నికల్, అప్లైడ్ సైన్సెస్ అని రెండు రకాలుగా విశ్వవిద్యాలయాలుంటాయి. మొదటివి రిసెర్చి ఓరియెంటెడ్ ప్రోగ్రాములను అందిస్తాయి. అప్లైడ్ సైన్సెస్ యూనివర్సిటీలు ఆచరణాత్మక పరిశోధన, పారిశ్రామిక శిక్షణపై దృష్టిపెడతాయి. రియల్ టైమ్ ఉద్యోగ వాతావరణంలో విద్యార్థులను సుశిక్షితులను చేస్తాయివి.
క్యూఎస్ వర్‌ల్డ్ ర్యాంకింగ్ ప్రకారం- ప్రపంచ స్థాయిలో ఉత్తమ శ్రేణి విద్యాసంస్థల్లో 45 జర్మన్ యూనివర్సిటీలున్నాయి.
టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యునిచ్, ఆర్‌డబ్ల్యూటీహెచ్ ఆచెన్, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డ్రెస్‌డెన్, యూనివర్సిటీ ఆఫ్ హేడల్‌బర్గ్, కార్ల్‌స్రుహె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాంటివి ప్రాచుర్యం పొందినవాటిలో కొన్ని.
పీజీ కోర్సుల్లో అత్యధికం ఇంగ్లిష్ మీడియంలోనే ఉంటాయి. బ్యాచిలర్ స్టడీస్‌లో ఇంగ్లిష్‌మీడియం బోధన కొన్ని విద్యాసంస్థల్లోనే ఉంటుంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ (బీఎస్‌సీ, ఎంఎస్‌సీ, పీహెచ్‌డీ)
* బిజినెస్ మేనేజ్‌మెంట్ (బీబీఏ, ఎంబీఏ)
* మెడికల్ సైన్సెస్ (బయోటెక్నాలజీ, మెడిసిన్, నర్సింగ్. ఇవి ఎక్కువగా జర్మన్ మాధ్యమంలోనే ఉంటాయి)
* మెడికల్ సైన్సెస్ (బయోటెక్నాలజీ, మెడిసిన్, నర్సింగ్. ఇవి ఎక్కువగా జర్మన్ మాధ్యమంలోనే ఉంటాయి)
కోర్సును బట్టి కొన్ని వర్సిటీలు టోఫెల్/ఐఈఎల్‌టీఎస్/జీఆర్‌ఈ/జీమ్యాట్ స్కోర్లను అడుగుతాయి.
విదేశీ విద్యార్థులు జర్మనీలో వారానికి 20 గంటలపాటు పార్ట్‌టైమ్ పని చేయటానికి అనుమతి ఉంది. జర్మన్ భాషా నైపుణ్యాలుంటే సులువుగా ఉద్యోగాలు దొరుకుతాయి.
ప్రాథమిక, అడ్వాన్స్‌డ్ స్థాయిలో జర్మన్ భాష నేర్పటానికి యూనివర్సిటీలు కోర్సులను అందిస్తాయి. Goethe-Instituts (Max Mueller Bhavan) /Goethe-Zentrums వద్ద ఈ భాషను నేర్చుకుని, ధీమాగా జర్మనీలో అడుగుపెట్టవచ్చు!
పీజీని పూర్తిచేస్తే అక్కడే 18 నెలలపాటు ఉండిపోయే అవకాశం ఇస్తారు. ఇలా కోర్సు ముగించినవారు వారానికి 40 గంటల ఫుల్‌టైమ్ పోస్ట్ స్టడీవర్క్ చేయవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ ఐదు అంచెల్లో....
దరఖాస్తు ప్రక్రియను తరగతులు ప్రారంభం కావటానికి కనీసం 6-8 నెలలముందు ప్రారంభించాల్సివుంటుంది. జర్మనీలో అడ్మిషన్ల సీజన్లు ప్రధానంగా రెండు.
వింటర్: అక్టోబరు. ఈ సెమిస్టర్ అక్టోబరు నుంచి మార్చి వరకు ఉంటుంది. ఈ ఇన్‌టేక్‌లో చేరదల్చినవారు విద్యాసంస్థలకు జులై 15లోపు దరఖాస్తు చేసుకోవాలి.
సమ్మర్: మార్చి/ఏప్రిల్. ఈ సెమిస్టర్ ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు ఉంటుంది. చేరదల్చినవారు జనవరి 15 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
1 అవసరమైన సమాచారాన్ని జర్మన్ అకడమిక్ ఎక్స్చేంజి సర్వీస్ DAAD (Deutscher Akademischer Austauschdienst), ఇంటర్నెట్, బ్రోషర్ల నుంచి సేకరించుకోవాలి. ఇన్ఫర్మేషన్ సెషన్లకూ, లేదా వెబినార్లకూ హాజరైతే పూర్తి అవగాహన వస్తుంది. ఈ కార్యక్రమాలు ఎప్పుడు జరిగేదీ www.daad.in ద్వారా తెలుసుకోవచ్చు.
2 ఆసక్తి ఉన్న యూనివర్సిటీని సంప్రదించాలి. అర్హత, కోర్సు వ్యవధి, ఫీ, దరఖాస్తు ప్రక్రియ మొదలైనవాటికి సంబంధించి కచ్చితమైన వివరాలు తెలుసుకోవాలి. దరఖాస్తు గడువు తేదీని గమనించాలి.
3 యూనివర్సిటీ/ కోర్సు వెబ్‌సైట్.. విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాలను సూచిస్తుంది. దానిప్రకారం దరఖాస్తును యూనివర్సిటీకి పంపుకోవచ్చు. లేదా యూని అసిస్టెంట్ అనే సంస్థకు కూడా పంపుకోవచ్చు. అది దరఖాస్తును స్వీకరించి, పరిశీలించి తన సభ్య యూనివర్సిటీలకు పంపిస్తుంది. ఈ సభ్య యూనివర్సిటీలు నేరుగా దరఖాస్తులను అనుమతించవు. ఈ యూనివర్సిటీల జాబితాను ్ర్ర్ర.్య-i్చ((i(్మ.్ట’ సైట్‌లో చూడవచ్చు.
4 అడ్మిషన్ లెటర్ పొందిన వెంటనే స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేయాలి. ఎందుకంటే ఆ ప్రక్రియకు 8 నుంచి 12 వారాల వ్యవధి పడుతుంది. జర్మన్ ఎంబసీ వెబ్‌సైట్ చూసి, వీసాకు ఎక్కడ దరఖాస్తు చేయాలో తెలుసుకోవచ్చు. మొదటి సంవత్సరం విద్యాభ్యాసానికి అవసరమయ్యే ఫండింగ్ రుజువులు అవసరమవుతాయి.
5 కోర్సు మొదలవటానికి కనీసం వారం రోజుల ముందే జర్మనీ చేరుకోవాలి. మార్గదర్శకత్వం కోసం యూనివర్సిటీకి సంబంధించిన ఇంటర్నేషనల్ ఆఫీసును సంప్రదించాలి. వచ్చిన మూడు నెలల్లోపే ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీసు నుంచి రెసిడెన్స్ పర్మిట్ తీసుకోవాలి.
ఉపయోగపడే వెబ్‌సైట్లు
జర్మనీలో విద్యాభ్యాసం గురించి...
www.daad.de/international-programmes
www.uni-assist.de
www.university-ranking.de, www.study-in.de
ఉపకారవేతనాల గురించి...
www.daad.in, www.funding-guide.de
No comments:
Post a Comment